సాలార్‌జంగ్ మ్యూజియం చూడాలనుందా.. అయితే మీకు శుభవార్త!

by GSrikanth |   (  Updated:2023-03-21 05:30:48  IST  )

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో భద్రపరిచిన అరుదైన వస్తువులు, చిత్రాలు, దాచి ఉంచిన చరిత్రను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు.

సాలార్‌జంగ్ మ్యూజియం చూడాలనుందా.. అయితే మీకు శుభవార్త!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో భద్రపరిచిన అరుదైన వస్తువులు, చిత్రాలు, దాచి ఉంచిన చరిత్రను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు. ‘గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌’ ప్రాజెక్టులో భాగంగా వీటిని సోషల్ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచినట్లు మ్యూజియం డైరెక్టర్‌ ఎ.నాగేందర్‌రెడ్డి తెలిపారు. మ్యూజియం సందర్శనకు సమయం లేనివారికి ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వివరించారు. డిజిటల్‌ వెర్షన్‌లో అరుదైన, పురాతన శిల్పాలు, చిత్రాలు, రాజులు ధరించిన వినూత్న దుస్తులు, మను స్క్రిప్ట్‌లు, సిరామిక్స్‌, హస్తకళలను ప్రదర్శిస్తున్నారు.

సింబల్స్‌ ఆఫ్‌ గ్లోరీ పేరుతో ఆనాటి రాజుల దర్పం ప్రతిబింబించేలా ఇరువైపులా పదును ఉండే కత్తి, సాలార్‌జంగ్‌-3 ఖడ్గం, షంషీర్‌, నాగన్‌ తదితరాలకు సంబంధించిన వివరాలు, చిత్రాలను నిక్షిప్తంచేశారు. ‘వండర్స్‌ ఇన్‌ వుడ్‌’ పేరుతో చెస్‌ ఆట పురోగతి, రెండో నిజాం సాహసయాత్ర, రాయల్‌ దక్కనీ కళాపోషణ వివరాలను డిజిటలైజ్‌ చేశారు. వీటితో పాటు మ్యాజిక్‌ ఆఫ్‌ బ్రాంజ్‌, ఇండియన్‌ ఎపిక్స్‌ ఇన్‌ ఆర్ట్స్‌, ఏ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ - హౌ చెస్‌ కాంకర్డ్‌ ది వరల్డ్‌, భారతదేశ చరిత్రకు సంబంధించిన 467 ముఖ్యమైన చిత్రాలు, హైదరాబాద్‌ చరిత్రకు సంబంధించి 387 చిత్రాలు, ఫైబర్‌ ఆర్ట్‌ తదితర వివరాలు ఉన్నాయి. వివరాల కోసం https://artsandculture.google.com/partner/salar-jung-museum వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

Next Story