GST మోసం కేసులో యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ గేమింగ్ సంస్థ డైరెక్టర్ అరెస్టు

by Prasad Jukanti |   (  Updated:2026-02-19 12:47:32  IST  )

ఫినటెక్ ముసుగులో భారీ మోసానికి పాల్పడిన ఆన్ గైమింగ్ సంస్థ డైరెక్టర్ ను హైదరాబాద్ జీఎస్టీ నిఘా విభాగం అరెస్టు చేసింది.

GST మోసం కేసులో యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ గేమింగ్ సంస్థ  డైరెక్టర్ అరెస్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీఎస్టీ మోసం (GST Fraud) కేసులో గేమింగ్ సంస్థ యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ (Addson Advisory Service) సంస్థ డైరెక్టర్ పంకజ్ కుమార్ (Pankaj Kumar) అరెస్ట్ అయ్యారు. జీఎస్టీ నిఘా విభాగం అధికారులు ఇవాళ హైదరాబాద్‍లో అతడిని అరెస్టు చేశారు. షెర్ కంపెనీలకు నకిలీ కేవైసీ వెరిఫికేషన్లతో రూ. 13 వేల కోట్ల విలువైన మోసానికి పాల్పడినట్లు పంకజ్ కుమార్‍పై ఆరోపణలు ఉన్నాయి. పేమంట్ గేట్‍వేల్, బ్యాంకింగ్ యాజ్ పేమెంట్ అగ్రిగేటర్ (బాపా) వ్యవస్థలతో ఈ సంస్థకు లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫిన్ టెక్ కంపెనీల సహాయంతో పంకజ్ అక్రమ ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారని ఈ సిండికేట్ అంతటిలో పంకజ్ కుమార్ కీలక సూత్రదారుల్లో ఒకరిగా ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థకు చెందిన రూ.100 కోట్లు ఉన్న బ్యాంక్ ఖాతాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) ఫ్రీజ్ చేసింది.

Next Story