- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్.. దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు
దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను (Telangana Cyber Crime Police) తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు సినిమాతో పాటు ఇతర భాషల సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. తాజాగా ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. హ్యాష్ ట్యాగ్ సింగిల్ అనే సినిమా పైరసీ అయిందని గతంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. అందులో కిరణ్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకోని విచారించగా వివరాలు బయటపడ్డాయి. పైరసీ ముఠా దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ ముఠా వల్ల.. సినిమా ఇండస్ట్రీకి రూ.22 వేల కోట్ల నష్టం కలిగిందని పోలీసులు అంచనా చేశారు.
హైదరాబాద్‌లో సోమవారం పైరసీకి వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. (piracy gang) పైరసీ ముఠాని అరెస్ట్ చేసినందుకు.. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిలిమ్ ఇండస్ట్రీ తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. పైరసీతో కేవలం సినీ పరిశ్రమకే కాదు.. ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం కలుగుతుందని చెప్పారు. సైరసీ వెనుక బెట్టింగ్ యాప్‌ల పాత్ర కూడా ఉందని అన్నారు. ఇకపై ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయరంటూ దిల్‌రాజు వెల్లడించారు. పైరసీ పెరిగే కొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయని వ్యాఖ్యనించారు.






