- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: బీసీ బిల్లు సాధన కోసం ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం
బీసీ బిల్లు విషయంలో కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4,5,6 తేదీల్లో తాను 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రకటించారు. ప్రభుత్వ అనుమతి కోరి దీక్షకు దిగుతానని ఒక వేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం తాను 72 గంటలు దీక్ష చేస్తే నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. 2018 పంచాయతీ రాజ్ సవరణ చట్టాన్ని సవరణ చేస్తూ తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) చేసిన డిమాండ్ తోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసిందని చెప్పారు. తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారని మరి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే సానుకూల తీర్పు వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు.
ఇది ఏమైనా సత్రం భోజనమా?
కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఒప్పందం కారణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదని కవిత ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయాలన్నారు. మేము ఢిల్లీలో చేసే ధర్నాకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఇదేమైనా సత్రం భోజనమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఢిల్లీకి రావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వం లేఖలు రాయలన్నారు. పొన్నం ప్రభాకర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం డ్రామా చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా శూన్యం అని రిజర్వేషన్ల విషయంలో బీజేపీ తప్పించుకుంటోందని విమర్శించారు. బీజేపీ బీసీ సీఎం, బీసీ పీఎం అంటున్న బీజేపీకీ బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు.






