- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనాలతో పాటు హెల్మెట్లు కచ్చితంగా ఇవ్వాలి: డీలర్లకు మంత్రి పొన్నం ఆదేశం
ప్రజలు రవాణా శాఖ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించి డిజిటల్ విప్లవాన్ని తీసుకువచ్చామని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలు రవాణా శాఖ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించి డిజిటల్ విప్లవాన్ని తీసుకువచ్చామని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ స్థాయి ‘వాహన్’ పోర్టల్‌ను మంత్రి సోమవారం బేగంపేటలోని వరుణ్ మోటార్స్‌లో లాంఛనంగా ప్రారంభించారు. వాహనదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ.. సోమవారం నుంచే రాష్ట్రంలో రెండో, తదుపరి వ్యక్తిగత వాహనాల కొనుగోలుపై ఉన్న 2 శాతం అదనపు జీవితకాల పన్నును రద్దు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఎత్తివేసి రవాణా రంగాన్ని సులభతరం చేశామని గుర్తుచేశారు.
గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వాహన్-సారథి సేవల అనుసంధాన ప్రక్రియను తమ ప్రభుత్వం ఏడాది కాలంలో పూర్తి చేసిందన్నారు. గత ఏడాది సారథిలో చేరగా... ఇప్పుడు వాహన్ పోర్టల్‌లో చేరడం ద్వారా తెలంగాణ రవాణా డేటా మొత్తం జాతీయ డేటాబేస్‌తో అనుసంధానమైందని మంత్రి తెలిపారు. దీనివల్ల వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ, పన్నుల చెల్లింపు వంటి సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని వివరించారు. రాష్ట్రంలో రోజుకు సుమారు 1500 కొత్త వాహనాలు వస్తున్న నేపథ్యంలో ఈ డిజిటల్ మార్పు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను ఈవీ బ్రాండ్‌గా మార్చడమే లక్ష్యంగా కొత్త ఈవీ, స్క్రాప్ పాలసీలను తెచ్చామన్నారు. ప్రభుత్వ వాహనాలన్నీ ఈవీలుగా మార్చాలని నిర్ణయించామని.. అందులో భాగంగానే ఇకపై ప్రభుత్వ అసరాలకు అన్నీ ఈవీలనే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డీజిల్ ఆటోల స్థానంలో రెట్రోఫిటింగ్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. వాహన్ పోర్టల్ ద్వారా ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకం చేశామని పేర్కొన్నారు. వాహనాలు విక్రయించే సమయంలో డీలర్లు కచ్చితంగా హెల్మెట్లు ఇవ్వాలని, పర్యావరణ పరిరక్షణ కోసం కొనుగోలుదారులకు ఒక మొక్కను అందించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ ఇలాంబర్తి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివలింగయ్య, ఎన్ఐసీ ప్రతినిధి జగదీప్, వరుణ్ మోటార్స్ యజమాని వరుణ్ తదితరులు పాల్గొన్నారు.






