- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Digest The Growth: కేటీఆర్, కేసీఆర్ లకు ఈనో ప్యాకెట్లు పంపిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
కేటీఆర్(KTR), కేసీఆర్(KCR) కడుపు మంట తగ్గేందుకు ఈనో ప్యాకెట్ల(Eno Packets)ను పంపుతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్(Congress MLC Balmoor Venkat) చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్(KTR), కేసీఆర్(KCR) కడుపు మంట తగ్గేందుకు ఈనో ప్యాకెట్ల(Eno Packets)ను పంపుతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్(Congress MLC Balmoor Venkat) చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన.. బీఆర్ఎస్ నాయకులపై(BRS Leaders) ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో(Davos Tour) లక్షా78 వేల 950 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి(Cm Revath Reddy), ఐటీ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), రైజింగ్ తెలంగాణ(Rising Telangana ) బృందానికి తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక కడుపు మంటతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అందుకే వారి కడుపు మంట తగ్గి జీర్ణ వ్యవస్థ మెరుగుపడేందుకు 'డైజెస్ట్ ది గ్రోత్'(Digest The Growth) అనే క్యాంపెయిన్(Campaign) స్టార్ట్ చేస్తూ.. కేటీఆర్, కేసీఆర్ లకు ఈనో ప్యాకెట్లు కొరియర్ చేస్తున్నానని చెప్పారు. అంతేగాక తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఈనో ప్యాకెట్లను కేసీఆర్, కేటీఆర్ సహా అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్న బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు పంపాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ఈనో ప్యాకెట్ల ద్వారా అయినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని జీర్ణించుకుంటారని తెలిపారు. డెవలప్ మెంట్ ను డైజెస్ట్ చేసుకోలేక ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ట్విట్టర్ లో ఏది పడితే అదే మాట్లాడుతున్నాడని, అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తే గుడ్డలు ఊడదీసి కొడతామని కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.






