- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ కంటే.. రేవంత్ రెడ్డే వెరీ డేంజరస్
కామారెడ్డి జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హౌజ్ అరెస్టులతో బీజేపీ నేతలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంతుద్దీన్ అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. హిందువులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేపై దాడి జరిగి రెండ్రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు స్పీకర్ ఆరా తీయకపోవడం దారుణమన్నారు. కేవలం 15 శాతం ఓట్ల కోసం ఎంఐఎంకు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కంటే.. రేవంత్ రెడ్డి వెరీ డేంజరస్ సీఎం అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పేర్లు మార్చుకోవాలని హితవు పలికారు. శ్రీధర్ బాబు.. శ్రీధర్ బాబాగా, భట్టి విక్రమార్క భట్టి అక్రమ్‌గా మార్చుకోవాలని సూచించారు.
అక్కడే రాజీనామా చేస్తా..
అంతకుముందు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కామారెడ్డిలో శనివారం జరిగింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందన్నారు. తనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారని, రేపటి నుంచే గ్రామాల్లోకి వెళ్తా ఎలా అడ్డుకుంటారో చూస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అభివృద్ధి విషయంలో ఆయనకు స్వాగతం పలుకుతానన్నారు. కాలేజీ భూముల విషయంలో తనపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి కాంగ్రెస్ నాయకులు రావాలని, సోమవారం నేనే కలెక్టరేట్‌కు వస్తానన్నారు. అక్కడ కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్‌లు కూడా ఉంటారన్నారు. వారి సమక్షంలోనే ఆధారాలను తీసుకువచ్చి నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానన్నారు.






