- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రఘునందన్ రావును పరామర్శించిన ధర్మపురి అరవింద్
మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాలికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా నేడు ఆయనను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. ర

దిశ, వెబ్ డెస్క్: మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాలికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా నేడు ఆయనను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. రఘునందన్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసి అరవింద్ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. రఘునందన్ రావును పరామర్శించి, వారి గురించి అడిగి తెలుసుకున్నానని అన్నారు. ముచ్చట పెట్టిన, నవ్వించిన అని పేర్కొన్నారు. ఫోటోలో ధర్మపురి అరవింద్ స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో స్వాగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక నిన్న బండి సంజయ్ సైతం రఘునందన్ రావును పరామర్శించారు. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీలో ఇటీవల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రాజాసింగ్ బీజేపీ చీఫ్ పదవిని ఆశించారు. కానీ ఆ పదవి రామచందర్ రావుకు దక్కడంతో రాజాసింగ్ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అరవింద్ రామచందర్ రావు అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.






