- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dharmapuri Arvind: బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై అర్వింద్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ (Telangana BJP) చీఫ్ నియామకంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి పూర్తిగా కట్టబుడి ఉన్నట్లు చెప్పారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేసినా మా మద్ధతు ఉంటుందని, పార్టీ నిర్ణయమే మా నిర్ణయం అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి సహకరిస్తామని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు.
కాగా. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును దాదాపు ఖరారు చేసింది. మరికాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. తనను పార్టీ ప్రెసిడెంట్ గా ప్రకటించిన అధిష్టానానికి రామచందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతల సహకారంతో బీజేపీని బలోపేతం చేస్తానని చెప్పారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజా విశ్వాసం కోల్పోయాయన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు.






