- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాకు ఏంది ఈ కర్ణభేరి 'పరీక్ష' ?? ధర్మపురి అరవింద్ సంచలన ట్వీట్
బీజేపీ ఎంపీ అరవింద్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. తమ నివాసానికి సమీపంలోని మసీద్ వద్ద ఏర్పాటు చేసిన స్పీకర్ నుండి వస్తున్న శబ్దాన్ని వీడియో తీసి.. రాత్రి పదకొండు గంటలకు ఈ కర్ణభేరి పరీక్ష ఏంటని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ అరవింద్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. తమ నివాసానికి సమీపంలోని మసీద్ వద్ద ఏర్పాటు చేసిన స్పీకర్ నుండి వస్తున్న శబ్దాన్ని వీడియో తీసి.. రాత్రి పదకొండు గంటలకు ఈ కర్ణభేరి పరీక్ష ఏంటని ప్రశ్నించారు. మరో 15 రోజుల్లో పదవతరగతి పరీక్షలు ఉన్నాయని, ఆ తరవాత ఇంటర్ పరీక్షలు ఉన్నాయని చెప్పారు. బాయ్.. మీకు జాగారం అయితే ఉండండి మమ్మల్ని పడుకోనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. రాత్రి పదకొండు గంటలకు ఇదేంటి అని అడిగారు.
మీరు క్షమాపణలు కోరే రాత్రి మమ్మల్ని శిక్షించకూడదని పేర్కొన్నారు. ఇక ధర్మపురి అరవింద్ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని అందుకే ఇలాంటి ట్వీట్ చేశారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇన్నిరోజులు గుర్తుకురాని స్పీకర్ శబ్దాలు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఏ ప్రార్థనా మందిరం అయినా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని స్పీకర్ లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.






