Dharmapuri Aravind : బనకచర్లకు అనుమతులు ఇచ్చిందే కేసీఆర్ : ధర్మపురి అరవింద్

by Muthe.Rajitha |

ఏపీ ప్రతిపాదిత గోదావరి-బనకచర్ల(Godavari-Banakacherla)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Aravind) కీలక వ్యాఖ్యలు చేశారు.

Dharmapuri Aravind : బనకచర్లకు అనుమతులు ఇచ్చిందే కేసీఆర్ :  ధర్మపురి అరవింద్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రతిపాదిత గోదావరి-బనకచర్ల(Godavari-Banakacherla)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Aravind) కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే అనుమతులు లభించాయని, అప్పట్లో జగన్, కేసీఆర్(Jagan-KCR) కలిసి తీసుకున్న నిర్ణయం ఇదని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తోందని.. అసలు తెలంగాణకు ఎంత నీరు కావాలో ఆయనకే అవగాహన లేదని అన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టు సముద్రంలో వృథాగా పోయే 3,000 టీఎంసీ గోదావరి నీటిలో కేవలం 200 టీఎంసీ నీటిని రాయలసీమకు తరలించడానికి ఉద్దేశించినదని, ఇది తెలంగాణ హక్కులకు హాని కలిగించదని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోందని, దిగువ రాష్ట్రంగా తమ హక్కులను వినియోగించుకుంటోందని అరవింద్ పేర్కొన్నారు.

Next Story