ముఖ్యమంత్రి పీఠంపై ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ముఖ్య‌మంత్రి పీఠంపై ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే బీసీ నేత ధ‌ర్మ‌పురి అర‌వింద్ ముఖ్య‌మంత్రి అవుతారా..?

ముఖ్యమంత్రి పీఠంపై ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ముఖ్య‌మంత్రి పీఠంపై ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే బీసీ నేత ధ‌ర్మ‌పురి అర‌వింద్ ముఖ్య‌మంత్రి అవుతారా..? అని ప్ర‌శ్నించగా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. బీజేపీలో కుల రాజ‌కీయాలు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. బీసీ నాయ‌కుడు శివ‌రాజ్ సింగ్ చౌహాన్ 20 ఏళ్ల వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్నార‌ని అన్నారు. ఆయ‌న త‌ర‌వాత కూడా అక్క‌డ బీసీ ముఖ్య‌మంత్రే ఉన్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించి బీసీ ముఖ్య‌మంత్రులే ఉన్నార‌ని అన్నారు. అది పెద్ద ప‌ని కాద‌ని, బీజేపీ మోడీ నాయ‌కత్వంలో అధికారంలోకి రావ‌డం పెద్ద ప‌నికాద‌న్నారు. ఆరు నెల‌ల్లో మొత్తం వాతావ‌ర‌ణాన్ని మార్చేస్తార‌ని అన్నారు. మీరు సీఎం అభ్య‌ర్థి అవ్వ‌రా అని మ‌రోసారి ప్ర‌శ్నించ‌గా... నన్ను అభిమానించే ప్ర‌తిఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతాన‌ని స‌మాధానం ఇచ్చారు.

Next Story