- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BhuBharati : దొరలు, భూస్వాముల కోసమే "ధరణి" : పొంగులేటి
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న "భూభారతి"(BhuBharati) పోర్టల్ కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న "భూభారతి"(BhuBharati) పోర్టల్ కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహ పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూ సవరణలు చేపడతామని "ధరణి"(Dharani) పేరుతో భూపందేరానికి తెగబడ్డారని అన్నారు. దొరలు, భూస్వాముల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకు వచ్చిందని, అది వారికి మాత్రమే ప్రయోజనాలు చేకూర్చిందని పేర్కొన్నారు. రైతులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు సరికదా.. అనేక అక్రమాలు జరిగాయని తెలిపారు.
తమ భూములు ఎప్పుడు ఏమవుతాయో తెలియక కంటిమీద కునుకు లేకుండా ప్రజలు గడిపారని అన్నారు. ధరణి అరాచకాల ఫలితం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలంతా చూశారని వెల్లడించారు. భూభారతి పోర్టల్ తో ఒకేసారి లక్షలమంది లాగిన్ అయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపిన మంత్రి.. ఎప్పటికప్పుడు పోర్టల్ లో అవసరమైన మార్పులు చేస్తామని అన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ పోర్టల్ ను అమలు చేసి.. ప్రజల స్పందన తెలుసుకొని, మార్పులు చేర్పులు చేసి జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.






