చైనా మాంజా అమ్ముతున్నట్టు మా దృష్టికి తీసుకొస్తే రూ.5 వేలు ఇస్తా.. ఎమ్మెల్యే బంపరాఫర్

by Ajay Maddhiboyina |

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా దుకాణాల్లో చైనా మాంజా అమ్మినట్లయితే తమ దృష్టికి తీసుకురావాల‌ని అన్నారు.

చైనా మాంజా అమ్ముతున్నట్టు మా దృష్టికి తీసుకొస్తే రూ.5 వేలు ఇస్తా.. ఎమ్మెల్యే బంపరాఫర్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా దుకాణాల్లో చైనా మాంజా అమ్మినట్లయితే తమ దృష్టికి తీసుకురావాల‌ని అన్నారు. స‌మాచారం ఇచ్చిన‌వారికి రూ.5వేల బ‌హుమ‌తి ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. స‌మాచారం ఇచ్చిన‌వారి పేరును గోప్యంగా ఉంచుతామ‌ని చెప్పారు. మాంజా అమ్మిన‌వారిపై కేసులు పెట్టించి అరెస్ట్ చేయిస్తాన‌ని హెచ్చ‌రించారు. చైనా మాంజాను తెలంగాణ వ్యాప్తంగా అమ్మ‌కూడ‌ద‌ని అన్నారు.

దానిపై నిషేదం విధించార‌ని చెప్పారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో చైనా మాంజాపై నిషేదం విధించారు. ఈ మాంజా వ‌ల్ల ప్ర‌మాదాలు పెరిగిపోతున్నాయి. ప‌క్షుల‌కే కాకుండా మ‌నుషుల‌కు సైతం తీవ్ర‌గాయాల‌పాలై మ‌రణిస్తున్న ఘ‌ట‌నలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్ప‌టికే దీనిపై నిషేదం విధించినా చాలా దుకాణాల్లో అమ్ముతున్నారు. త‌క్క‌వ ధ‌ర‌కే ఇది ల‌భించ‌డం, ఇత‌ర మాంజాల కంటే ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండ‌టంతో కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Next Story