- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో వారం పాటు ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ ప్రచారం
సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని డీజీపీ ఇవాళ ప్రారంభించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా గతేడాది సైబర్ నేరాలు పెరిగితే తెలంగాణలో మాత్రం తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadar Reddy) తెలిపారు. మన అప్రమత్తతే సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుతుందని అన్నారు. ఇవాళ సైబర్ నేరాలపై అవగాహనకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' (Fraud Ka Full Stop campaign)కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. ఆరు వారాల పాటు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ సమాజంలో ప్రమాదకరంగా ఉన్న నేరం సైబర్ క్రైమ్ అని పదేళ్ల క్రితం బందిపోట్లు, డెకాయిటి, దొంగతానాలు, పెద్ద నేరాలు జరిగేవి కానీ ఇటీవల సైబర్ క్రైమ్ పెద్ద పీడగా మారిందన్నారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ సైబర్ నేరాలకు గురవుతున్నారని సెల్ ఫోన్ లో ఒక్క క్లిక్ తో ప్రజల డబ్బులు కాజేస్తున్నారన్నారు. అత్యాశకు పోయి చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని సైబర్ నేరాల పట్ల అలర్ట్ గా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా టీజీ సీఎస్ బీ డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ తెలంగాణలో బాధితులు రోజుకు రూ.4 కోట్ల సైబర్ మోసాల ద్వారా కోల్పోతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ. 350 కోట్లను బాధితులకు రీఫండ్ చేశఆమన్నారు.






