డీజీపీ చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్‌ యాప్‌ ప్రారంభం

by Ajay Maddhiboyina |

రక్తం అవసరమైన వారికి తక్షణమే దాతల సమాచారం అందించే ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్’ వెబ్‌ అప్లికేషన్‌ను డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

డీజీపీ చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్‌ యాప్‌ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రక్తం అవసరమైన వారికి తక్షణమే దాతల సమాచారం అందించే ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్’ వెబ్‌ అప్లికేషన్‌ను డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రక్తదాతలు – పేషెంట్ల మధ్య వేగంగా సమాచారం అందేలా ఈ వెబ్‌ యాప్‌ను రూపొదించినట్లు ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చింతల సంపత్ తెలిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చింతల సంపత్‌ను డీజీపీ అభినందించారు. రక్తం అవసరమైన సమయంలో దాతను గుర్తించే సాంకేతిక సదుపాయం ఈ అప్లికేషన్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కోన్నారు. రక్తదాతల వివరాలు గోప్యంగా ఉండే విధంగా, ఆధునిక సాంకేతికతతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో త్వరగా దాతను గుర్తించే వ్యవస్థ వంటి ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచరనిచినట్లు పేర్కోన్నారు.

Next Story