- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ పీఎంజీ నగల దుకాణంలో కాల్పులు, చోరీ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు దొంగలను పట్టుకునేందుకు ఇప్పటికే సీపీ గౌస్ ఆలం ప్రత్యేక బృందాలతో నగరాన్ని అష్టదిగ్బంధనం చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, క్లూస్ టీమ్స్, టెక్నికల్ నిపుణుల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం 12 పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు నిర్ధారించారు. చోరీ సమయంలో హిందీలో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు టాస్క్ ఫోర్స్ బృందాలు బయలుదేరాయి.
Next Story






