- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DGP: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం.. కీలక ఫైళ్లపై క్లారిటీ ఇచ్చిన డీజీపీ
నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (Forensic Science Lab)లో అగ్ని ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (Forensic Science Lab)లో అగ్ని ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందులో ఉన్న కీలక కేసులకు సంబంధించి ఫైళ్ల దగ్ధంపై వస్తున్న వార్తలపై తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన డీజీపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చివర్లో ఆయన మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని అన్నారు. సర్వర్ రూమ్ దగ్ధమైనా.. బ్యాక్ అప్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని కామెంట్ చేశారు. ‘ఓటుకు నోటు’ కేసు (Vote For Note Case) ఫైల్స్ తగులబడ్డాయనేది పూర్తిగా అవాస్తమని అన్నారు. 2021లోనే ఓటుకు నోటు ఫైల్స్ కోర్టుకు హ్యాండోవర్ చేశామని తెలిపారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రిపోర్ట్స్ ఇచ్చేశామని, మరో 7 కీలక ఫైళ్లకు సంబంధించిన డేటాను రిట్రీవ్ చేస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.






