గవర్నర్‍‍తో నూతన డీజీపీ సీ.వీ ఆనంద్ భేటీ

by Prasad Jukanti |   (  Updated:2026-05-02 07:45:24  IST  )

తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ శనివారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్‍‍తో నూతన డీజీపీ సీ.వీ ఆనంద్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు స్వీకరించిన సి.వి.ఆనంద్ (CV Anand) శనివారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను (Shiv Pratap Shukla) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టినందుకు సి.వి.ఆనంద్‌ను గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిద్దరి మధ్య కాసేపు అధికారిక చర్చలు జరిగాయి. కాగా డీజీపీగా శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నూతన డీజీపీగా సీవీ ఆనంద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నిన్న ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.

లా అండ్ ఆర్డర్‌లో నయా వైభవం!

Next Story