TG: ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా

by Prasad Jukanti |   (  Updated:2026-04-22 13:08:44  IST  )

తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ప్రమోషన్స్ కల్పించింది

TG: ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ పదోన్నతులు కల్పించింది. ఆరుగురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులకు డీజీ హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1995 బ్యాచ్ కు చెందిన ఏడీజీలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వీవీ శ్రీనివాసరావుకు డీజీ హోదా కల్పించారు. 1996 బ్యాచ్‍కు చెందిన చారుసిన్హా, అనిల్ కుమార్, సజ్జనార్ లకు డీజీ ర్యాంకులు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఆరుగురు అధికారులు తమకు పదోన్నతి లభించినప్పటికీ ప్రస్తుతం వారు ఏ బాధ్యతల్లో ఉన్నారో అవే పోస్టింగ్స్‌లో కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వీరు తమ ప్రస్తుత విభాగాల్లోనే డీజీ హోదాలో సేవలందిచనున్నారు.





Next Story