- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్తను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్తను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్(IPS)అధికారులు వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌లో జాయిన్కావాలని కేంద్ర హోంశాఖ(Central Home Ministry) శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. మాజీ డీజీపీ అంజనీ కుమార్(Anjani Kumar), ఐపీఎస్‌లు అభిషేక్‌మహంతి(Abhishek Mahanty), అభిలాష బిస్త్(Abhilash Bisht)లను ఏపీలో జాయిన్ కావాల్సిందిగా సూచించింది. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‌లను రిలీవ్ చేసింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. కాగా, క్యాట్ ఆదేశాల మేరకు ప్రస్తుతం వీరు తెలంగాణలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Next Story






