Medaram Jatara 2026: ‘పదివేల దండలే తల్లి అబ్బిస్సా..’ జంపన్న వాగులో భక్తుల పబ్బతి

by Bhoopathi Nagaiah |

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

Medaram Jatara 2026: ‘పదివేల దండలే తల్లి అబ్బిస్సా..’ జంపన్న వాగులో భక్తుల పబ్బతి
X

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరిగే మహా జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించడం అనవాయితీగా వస్తుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు జంపన్న వాగులో ఇసుకతో వన దేవతల ప్రతిమలు ఏర్పాటు చేసి కొబ్బరి కాయ పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివ సత్తుల పునకాలతో జంపన్న వాగులో ‘పదివేల దండలే తల్లి అబ్బిస్సా..’ అంటూ సమ్మక్క తల్లికి పబ్బతి పడుతూ పుణ్య స్నానాల ఆచరించి వన దేవతలకు ఓడి బియ్యం బంగారం సమర్పించి తమ మొక్కలను చెల్లించి తమ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇంటి ఇలవేల్పుగా ఆరాధిస్తున్నారు.

Next Story