మేడారానికి తరలివస్తున్న భక్తులు

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-05 06:12:41  IST  )

వనదేవతలు సమ్మక్క, సారలమ్మల మహా జాతర సమీపిస్తున్న వేళ మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది

మేడారానికి తరలివస్తున్న భక్తులు
X

దిశ,వెబ్‌డెస్క్: వనదేవతలు సమ్మక్క, సారలమ్మల మహా జాతర సమీపిస్తున్న వేళ మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మేడారం ప్రాంతం మినీ జాతరను తలపించింది. భక్తిశ్రద్ధలతో వనదేవతలను దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో తరలిచ్చిన భక్తులు మొదటగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం జంపన్న, నాగులమ్మలకు ముడుపులు చెల్లించారు.

అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకుని వనదేవతలను దర్శించుకుని బంగారం(బెల్లం), పసుపు, కుంకుమ, సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జంపన్న వాగు పరిసరాలు గద్దెల ప్రాంతం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడాయి. దీంతో మేడారంకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

Next Story