Mini Medaram Jatara(2025):మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

by Jakkula.Mamatha |

ఆసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ(Telangana) కుంభమేళాగా మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర జరుగుతుండగా.. ఈ జాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతుంది.

Mini Medaram Jatara(2025):మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ(Telangana) కుంభమేళాగా మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర జరుగుతుండగా.. ఈ జాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతుంది. ఈ క్రమంలో ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ మేడారం(Mini Medaram) జాతరను ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగనుంది.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర(Maharashtra), ఛత్తీస్గఢ్(Chhattisgarh)​ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు(Devotees) తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో రద్దీ నెలకొంటుందని భావించిన కొందరు భక్తులు ముందుగానే జాతరకు వస్తున్నారు. ఈ క్రమంలో సమ్మక్క, సారలమ్మ వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ తరుణంలో భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తే మంచి జరుగుతుందని, కోరిన కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. ఈ క్రమంలో మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది.

మరో వారం రోజుల్లో మినీ జాతర మొదలవుతుంది. దీంతో భక్తులు(Devotees) భారీ సంఖ్యలో తరలివచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందుగా జంపన్నవాగులో స్నానాలు ఆచరించి తర్వాత వనదేవతలను దర్శించుకుంటున్నారు. గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం సమర్పించారు. భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story