Yadagirigutta: యాదగిరిగుట్టలో బస్సు కోసం భక్తుల కుమ్ములాట.. పలువురుకి గాయాలు (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-05-15 14:27:35  IST  )

యాదగిరిగుట్ట కొండపై బసు కోసం భక్తుల కుమ్ములాట

Yadagirigutta: యాదగిరిగుట్టలో బస్సు కోసం భక్తుల కుమ్ములాట.. పలువురుకి గాయాలు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రసిద్ధ యాదగిరి గుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం (Lakshminarasimha Swamy Temples) వద్ద బస్సు కోసం భక్తులు కుమ్మలాటకు దిగారు. కొండపై దేవస్థానం బస్టాండ్ ఆవరణలో బస్ ఎక్కే సమయంలో భక్తులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలైనట్లు సమాచారం. యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి ఆలయం వరకు, ఆలయం నుంచి గుట్ట బస్ స్టాండ్ వరకు ఆర్టీసీ ఉచితంగా యాదాద్రి దర్శిని పేరుతో మినీ బస్సులను నడుపుతోంది. ఈ క్రమంలో ఓ బస్సు (RTC Bus) ఇవాళ గుట్టపైన బస్టాండ్ లోకి రాగానే ఎక్కేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో పరస్పరం తోపులాట జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన భక్తులు పరస్పరం తోసుకుంటూ కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Click For Tweet..

Next Story