- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ బద్మాష్ పార్టీలు.. కాగజ్‍నగర్ ప్రచారంలో రెచ్చిపోయిన దేవేంద్ర ఫడ్నవీస్
తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకుల వల్ల తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విర్శించారు. విగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఈ రెండు ప్రభుత్వాల్లోని పాలకుల వల్ల అప్పులు మిగిలాయన్నారు. ఉమ్మడి ఆధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మహారాష్ట్రతో నీటి గొడవలు ఉన్నాయని 20, 25 ఏళ్లుగా ఈ గొడవలు కొనసాగినా తెలంగాణ వచ్చాక మేము గొడవలు పెట్టుకోవాలని అనుకోలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015లో నాటి సీఎం కేసీఆర్ తన వద్దకు వచ్చి గోదావరి జలాలు మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాడు కేసీఆర్‍కు ఒక్కటే చెప్పామని మనమంతా భారతీయులమని ఈ గొడవలు వద్దని చెప్పాన్నారు. అయితే కొంచెం ఎత్తు తగ్గించుకుంటే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని అలాగే గడ్చిరోలి ముంపు నుంచి బయటపడుతుందని చెప్పానన్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలాంటి గొడవలు లేకుండా తెలంగాణకు నీళ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్న ఇరిగేషన్‍కు తమ కృషి వల్లే జరిగిందన్నారు.
ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు రండి:
సిర్పూర్ ఎమ్మెల్యే ప్రాణహిత ప్రాజెక్టు గురించి అడుగుతున్నారని ఫడ్నవీస్ గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని ఎమ్మెల్యే హరీశ్ బాబును సీఎం ఆహ్వానించారు. మా రాష్ట్రానికి నష్టం లేకుండా పొరుగు రాష్ట్రానికి మేలు జరుగుతుంటే స్వాగతిస్తామంటారు. ఇక్కడి రైతులకు న్యాయం జరుగుతుంది అంటే దాని కోసం చర్చిద్దామన్నారు. తెలంగాణకు నీళ్లు ఇచ్చేందుకు మాకు సంతోషమేనన్నారు. మేడిగడ్డతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇస్తామని చెప్పి బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని, మేము నీళ్లు ఇచ్చినా నియత్ నిలుపుకోలేదని దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలు తొడుదొంగలని మహారాష్ట్ర రైతులకు తాను సర్ది చెప్పానని ఆ తర్వాత తమ ప్రభుత్వమే వారికి నష్ట పరిహారం అందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నుంచి గడ్చిరోలి హైవే నిర్మాణం చేపడతామన్నారు. మహారాష్ట్రలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిందన్నారు. తెలంగాణ మహారాష్ట్రకు పొరుగునే ఉందని మహారాష్ట్ర గాలి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ వీయబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.






