- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు మోడీ సర్కార్ అందించిన కానుక ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి ప్రధాని మోడీ సర్కార్ మరో కానుక అందించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులకు అవసరమైన పరిశోధనలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే టార్గెట్ గా.. భారతదేశంలో మొదటిసారిగా ‘గృహ-5’ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పరిశోధనా కేంద్రంలో వివిధ రకాల పరిశోధనా సౌకర్యాలను కల్పించానున్నట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత పౌరవిమానయాన రంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ పరిశోధనా కేంద్రాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.
సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సీఏఆర్ ఓ)లో ఏర్పాటు చేసేవివే..
1. విమానాశ్రయాలు, ఎయిర్ నావిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు
2. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్స్
3. డొమైన్ సిమ్యులేటర్స్
4. నెట్ వర్క్ ఎమ్యులేటర్
5. విజువలైజేషన్ అండ్ అనాలసిస్ ల్యాబ్స్
6. సర్వేలెన్స్(నిఘా) ల్యాబ్స్
7. నావిగేషన్ సిస్టమ్స్ ఎమ్యులేషన్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్స్
8. సైబర్ సెక్యూరిటీ అండ్ థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్
9. డేటా మేనేజ్‌మెంట్ సెంటర్
10. ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్
11. సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అండ్ టూల్స్ సెంటర్
12. నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెంటర్