2027 చివరికల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి: మంత్రి ఉత్తమ్

by Prasad Jukanti |   (  Updated:2026-05-16 12:04:48  IST  )

2027 చివరికల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

2027 చివరికల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి: మంత్రి ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2027 చివరికల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 38.16 టీఎంసీలతో తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు నీరు అందిస్తామని 8 జిల్లాలతో పాటు కరీంగనర్ జిల్లాలో 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుదని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, సీతక్క సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దేవాదుల ప్రాజెక్టుపై ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు రూ. 14,422 కోట్లు అని ఇప్పటి వరకు 87.70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మరో రూ. 3,978 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళిక చేస్తున్నామన్నారు.

Next Story