- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదానికి కారణం అయిన టిప్పర్, డ్రైవర్, ఓనర్ వివరాలు ఇవే
తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జా గూడ సమీపంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జా గూడ సమీపంలో చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో అధికంగా మహిళలే ఉన్నారు. ఇదిలా ఉంటే దాదాపు 21 మంది ప్రాణాలు తీసిన టిప్పర్ వివరాలను పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ గా గుర్తించారు. అతను మహారాష్ట్ర వాసి కాగా.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ టిప్పర్ వాహనం.. పటాన్చెరు క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా ఓవర్ స్పీడ్ కారణంగా అదుపుతప్పి బస్సును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.
READ MORE .....






