ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌.. మృతుల గుర్తింపు, రివార్డుల ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-12 10:45:18  IST  )

ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే.

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌.. మృతుల గుర్తింపు, రివార్డుల ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. గరియాబంద్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా వీరి వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ పది మంది మావోయిస్టుల పేరు మీద మొత్తం భారీ స్థాయిలో రివార్డులు ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి 72 లక్షలు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.72 లక్షలు, ఒడిశా ప్రభుత్వం రూ.72 లక్షలు రివార్డులు ప్రకటించింది.

మృతుల వివరాలు - రివార్డులు

1. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్. ఈయన పేరుమీద రూ.కోటి, రూ.50 లక్షల రివార్డు ఉంది.

2. ఏపీకి చెందిన ప్రమోద్ అలియాస్ పాండు. ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఈయన తలపై రివార్డులు రూ.25 లక్షలు (ఒడిశా), రూ.20 లక్షలు (ఛత్తీస్‌గఢ్), రూ.20 లక్షలు (మహారాష్ట్ర).

3. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విమల్ అలియాస్ మంగన్న @ సురేష్ – టెక్నికల్ టీం ఇన్‌చార్జ్ (డీవీసీఎం). ఇతడి తలపై రూ.8 లక్షలు (తెలంగాణ), రూ.5 లక్షలు (ఛత్తీస్‌గఢ్), రూ.5 లక్షలు (మహారాష్ట్ర) రివార్డులు.

4. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విక్రమ్ @ మంజు – సీఏఎమ్ కమిటీ సభ్యుడు ఇతడి తలపై రూ.5 లక్షలు (ఒడిశా), రూ.4 లక్షలు (ఛత్తీస్‌గఢ్), రూ.4 లక్షలు (మహారాష్ట్ర) రివార్డులు.

5. ఉమేశ్ @ సుకన్ – ఎస్‌డీకే డిప్యూటీ కమాండర్. ఇతడి తలపై రూ.5 లక్షలు (ఒడిశా), రూ.4 లక్షలు (ఛత్తీస్‌గఢ్), రూ.4 లక్షలు (మహారాష్ట్ర) రివార్డులు.

6. రజిత – ఎస్ఎంసీ సభ్యురాలి తలపై రివార్డులు రూ.5 లక్షలు (ఒడిశా), రూ.4 లక్షలు (ఛత్తీస్‌గఢ్), రూ.4 లక్షలు (మహారాష్ట్ర)

7. అంజలి – టెక్నికల్ టీం సభ్యురాలి తలపై రూ.5 లక్షలు (ఒడిశా), రూ.4 లక్షలు (ఛత్తీస్‌గఢ్), రూ.4 లక్షలు (మహారాష్ట్ర) రివార్డులు.

8. సింధు – టెక్నికల్ టీం సభ్యురాలి తలపై రివార్డులు రూ.5 లక్షలు (ఒడిశా), రూ.4 లక్షలు (ఛత్తీస్‌గఢ్), రూ.4 లక్షలు (మహారాష్ట్ర).

9. ఆరతి – టెక్నికల్ టీమ్ సభ్యురాలి తలపై రూ.3 లక్షలు (మూడు రాష్ట్రాలు)

10. సమీర్ – పీఎం-06 కంపెనీ సభ్యుడిపై రూ.3 లక్షలు (మూడు రాష్ట్రాలు) రివార్డులు.


పోలీసులు విడుదల చేసిన ప్రకటన కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Next Story