మరోసారి హాట్ టాపిక్‌గా కేసీఆర్ ఆస్తుల వివరాలు!

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మరోసారి హాట్ టాపిక్‌గా కేసీఆర్ ఆస్తుల వివరాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై కీలక వ్యా్ఖ్యలు చేశారు. అధికారం కుటుంబ హక్కుగా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అంటూ.. అధికారం వాళ్లకే సొంతం అనేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేశాడని జాతిపిత అంటున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని వేల కోట్లు సంపాదించారని కడియం శ్రీహరి ఆరోపించారు. 2014కు కేసీఆర్ కుటుంబసభ్యుల ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎన్ని అని కడియం శ్రీహరి ప్రశ్నించారు.

ఆస్తుల వివరాలన్నీ ప్రజల ముందు పెట్టాలని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ స్కాములు చేశారు.. అందరిపైనా కేసులు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కుటుంబంపై కేసులు పెడితే.. తెలంగాణను అవమానించినట్లు ఎలా అవుతుందని అన్నారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య సొత్తా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటారని అడిగారు. ప్రతీ ఎన్నికలో ప్రజలు ఓడిస్తున్నా.. అహంకారం తగ్గడం లేదు.. మాట తీరులో మార్పు రాలేదని విమర్శించారు. అందుకే ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నారని అన్నారు.

Next Story