Stray Dogs: జీహెచ్ఎంసీ ఖర్చులు కోట్లలో.. వీధి కుక్కల నియంత్రణ నామమాత్రమే!

by Ramesh Naini |

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కుక్కల నియంత్రణ సవాల్‌గా మారింది.

Stray Dogs: జీహెచ్ఎంసీ ఖర్చులు కోట్లలో.. వీధి కుక్కల నియంత్రణ నామమాత్రమే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో కుక్కల నియంత్రణ సవాల్‌గా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో పాటు కుక్కల నియంత్రణ చట్టం ఉన్నా జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదకరమైన, దీర్ఘకాలికంగా రోగాల బారిన పడిన కుక్కలను నియంత్రించడానికి ఉన్న చట్టాలను పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది చిన్నా రులు కుక్కల దాడుల్లో మరణించారు. అయితే 2023లో అంబర్‌పేట్ నాలుగేండ్ల బాలుని కుక్కలు పీక్కుతిన్న సంఘటను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. అయితే యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), (Anti rabies vaccination) యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ (ఏఆర్వీ)ల కోసం ఒ క్కో కుక్కకు రూ.1500 ఖర్చు చేస్తున్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నా (Stray Dogs) కుక్కల నియంత్రణ నామమాత్రంగానే ఉంది.

రూ.40 కోట్ల పైనే..

జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 4 లక్షల వీధి కుక్కలున్నాయి. వీటిలో 77 శాతం కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కుక్కల నియంత్రణకు ‘కంట్రోల్ ఆఫ్ స్ట్రే యానిమల్స్’ హెడ్ పేరుతో ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తున్నారు. స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇతర జంతువుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఐదేండ్లలో రూ.40 కోట్ల పైనే ఖర్చు చేశారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), యాంటీ రేబిస్(ఏఆర్) కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా 70 శాతం కుక్కలకు ఆపరేషన్లు చేయలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక్క కూకట్‌పల్లి జోన్ పరిధిలోనే ఐ దేండ్లలో రూ.8.50 కోట్లు కేటాయిస్తే రూ. 6.95 కోట్లు ఖర్చు చేశారు. అంటే మిగిలిన జోన్లలో సుమారుగా రూ.7 కోట్ల చొప్పున రూ.40 కోట్ల పైనే ఉంటుంది.

గ్రేటర్‌లో 1.50 లక్షలపైనే..

జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 4 లక్షల వీధి కుక్కలున్నాయి. వీటిలో 77 శాతం కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఐదేండ్ల పాటు 1.50 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఇక వీధి కుక్కలకు సంబంధించిన ఫిర్యాదులు 50 వేలకు పైగా ఉన్నాయని సమాచారం. ఒక్క కూకట్‌పల్లి జోన్ పరిధిలో 4 వేలకు పైగా ఉన్నాయి.

అటకెక్కిన కుక్కల సర్వే..

జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయని అధికారుల వద్ద లెక్కల్లేవు. అందుకు సర్వే చేయకపోవడమే కారణం. 2023లో బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లెక్కల ప్రకారం సుమారు 4 లక్షలు అని చెబుతున్నారు తప్ప కచ్చితమైన లెక్కల్లేవనే విమర్శలున్నాయి. దీంతోపాటు వీధి కుక్కల నియంత్రణ, వ్యాక్సినేషన్ పేరుతో కోట్ల రూపాయలను స్వచ్ఛంద సంస్థలకు కట్టబెడుతున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రజా సంఘాల నేతలు పేర్కొంటున్నారు

Next Story