- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదవీ త్యాగానికి కట్టుబడి ఉన్నా.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చివరి వరకు మంత్రి పదవిని ఆశించిన భంగపడిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Ranga Reddy) మంత్రివర్గ విస్తరణపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: చివరి వరకు మంత్రి పదవిని ఆశించిన భంగపడిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Ranga Reddy) మంత్రివర్గ విస్తరణపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఇయన మీడియాతో మాట్లాడుతూ.. ఏళ్లుగా పార్టీ జెండానే నమ్ముకుని పనిచేస్తున్న వాళ్లకు పదవులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కొత్తగా పార్టీలోకి వచ్చని వాళ్లకు పదవులు ఇచ్చుకుంటూ పోతే.. పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల విశ్వసనీయత దెబ్బతింటుందని.. వారు రకమైన మానసిక వేదనకు గురవుతారని కామెంట్ చేశారు.
తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మొర పెట్టుకున్నా.. పార్టీ హైకమాండ్ కనీసం పట్టించుకోకపోవడం ఎంతో బాధ కలిగించిందని అన్నారు. భవిష్యత్తులోనూ పరిస్థితులు ఇలానే కొనసాగితే.. పార్టీ విపత్కర పరిస్థితులు ఎదర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇచ్చిన జిల్లాలకే రెండు, మూడు మంత్రి పదవులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో రాష్ట్ర అధినాయకత్వంతో పాటు అధిష్టానానికే తెలియాలని అన్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలను విస్మరించారని.. 10 ఉమ్మడి జిల్లాలకు ఒక్కో మంత్రి పదవి ఉండాలన్నారు. తాను ఇప్పటికీ పదవీ త్యాగానికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు.






