TG News : దోచుకోవడానికే డిజైన్లు మార్చారు : ఎంపీ చామల కిరణ్ కుమార్

by Muthe.Rajitha |

కాళేశ్వరం విచారణ(Kaleswaram Inquiry) వెనుక రేవంత్ రెడ్డి కక్ష్య పూరిత దురుద్దేశం ఉందన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) తీవ్రంగా ఖండించారు.

TG News : దోచుకోవడానికే డిజైన్లు మార్చారు : ఎంపీ చామల కిరణ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం విచారణ(Kaleswaram Inquiry) వెనుక రేవంత్ రెడ్డి కక్ష్య పూరిత దురుద్దేశం ఉందన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కమిషన్(Kaleswaram Commission) కేసీఆర్, ఈటల, హరీష్ రావు, తదితర ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చిందని, వారంతా ఓపెన్ కోర్టులో వాంగ్మూలం ఇస్తే, కేసీఆర్(KCR) మాత్రం ఓపెన్ కోర్టులో ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా రాష్ట్ర బాగు కోసమే కట్టి ఉంటే, ఇపుడు ఈ విచారణ అవసరం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్ మార్పులు ముమ్మాటికీ దోచుకోవడానికే జరిగాయని స్పష్టం చేశారు. కమిషన్ మీద ఎలాంటి ప్రభుత్వ ఒత్తిళ్లు లేవని, స్వతంత్రంగా పనిచేస్తోందని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని చెప్పారు. కాగ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ఇప్పటివరకు అధికారులు, ఇంజనీర్ల నుంచి సాక్ష్యాలు సేకరించి, నివేదిక సిద్ధం చేస్తోంది. అలాగే కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లను కూడా విచారించింది. త్వరలోనే ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది.

Next Story