- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: డిప్యూటీ కలెక్టర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
TG: డిప్యూటీ కలెక్టర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విక్టర్, ప్రధాన కార్యదర్శిగా కే.చంద్రకళ ఎన్నికయ్యారు. తెలంగాణా డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అడిషనల్ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు సంఘం కేంద్ర సంఘ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు.
దాంతో పాటు 2025- 2028 కాలానికి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో వి. విక్టర్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. మరియు ప్రధాన కార్యదర్శిగా కె.చంద్రకళ, కోశాధికారిగా చొల్లేటి వెంకటేశ్వర్లు ఎన్నుకోబడ్డారు. మరియు అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఆర్ఎస్. చంద్రావతి, ఎం. నగేష్, మహిపాల్ రెడ్డి, హనుమా నాయక్, ఎస్.రాజేశ్వరి తదితరులు ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కె.ఉపేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఈ సమావేశంలో పూర్వ అధ్యక్షులు కే.చంద్రమోహన్, పూర్వ ప్రధాన కార్యదర్శి డీ.శ్రీనివాస్ రెడ్డి నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కే. నిరంజన్ రావు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు చర్చించి తీర్మానించారు.






