- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్ఎండీఏ మీద మోజు.. డిప్యూటీ కలెక్టర్ షర్మిల సస్పెండ్
హెచ్ఎండీఏలో డిప్యూటేషన్‌పై పని చేస్తోన్న డిప్యూటీ కలెక్టర్ షర్మిలను సస్పెండ్ చేస్తూ సీసీఎల్ఏ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏలో డిప్యూటేషన్‌పై పని చేస్తోన్న డిప్యూటీ కలెక్టర్ షర్మిలను సస్పెండ్ చేస్తూ సీసీఎల్ఏ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను ఉట్నూరు ఆర్డీవోగా, ఆదిలాబాద్ జిల్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐతే ఆమె ఇప్పటి వరకు జాయిన్ కాలేదు. దాంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) మ్యాపింగ్ పనులపై తీవ్ర ప్రభావం పడింది. ఉట్నూరుకు వెళ్లకుండా హెచ్ఎండీఏలోనే తిష్ట వేశారు. నిజానికి వృత్తిపరంగా ఎక్కడికి బదిలీ చేసినా వెళ్లాలి. కానీ ఆమె ఉట్నూరు ప్రాంతానికి వెళ్లడం దూరాభారం అనుకున్నారు. అలాగే హెచ్ఎండీఏలో లాభదాయకమైన పనులు ఉంటాయని, ఇక్కడ రూ.వేల కోట్ల పనులు నిరంతరం సాగుతుంటాయి.
ఈ క్రమంలోనే ఆమెను ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లకుండా జాప్యం చేసినట్లు సమాచారం. ఆమెను బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లాలని అనేక సార్లు ఆదేశించినా ఖాతరు చేయలేదు. అందుకే నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని సీసీఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉన్న కాలంలో సీసీఎల్ఏ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.






