- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువ వికాసానికి సిబిల్ స్కోర్ కీలకమేనా?.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ CM భట్టి
తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) భారీ శుభవార్త చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) భారీ శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం(Rajeev Yuva Vikasam) స్కీ్మ్‌పై కీలక ప్రకటన చేశారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారనే వార్తల్లో నిజం లేదని.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. సర్కారును బద్నా చేయాలనే కొందరు వ్యూహాత్మకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని తెలిపారు. జూన్ 2వ తేదీ నుంచి కేటగిరీని బట్టి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం మంజూరు చేస్తామని వెల్లడించారు.
16.25 లక్షల దరఖాస్తులు...
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుని ఈ పథకాన్ని తీసుకువచ్చింది. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి మార్చి నుంచి ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. అనంతరం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన రిసిప్ట్‌ను జతచేస్తూ మాన్యువల్‌గా దరఖాస్తు ఆఫీసుల్లో అందించాలని ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా 16,25,441 మంది నిరుద్యోగ యువత యువ వికాసం కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. అయితే దాని అమలు కోసం కొత్తగా ‘సిబిల్ స్కోర్’ నిబంధనను తెచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇదే అదునుగా భావించిన విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. దీంతో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి స్పందించి వివరణ ఇచ్చారు.






