- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka) నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని (Tirumala Sri Venkateswara Swamy) దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలకగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క, రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్, జమ్మూ, కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హాలు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులను కలిసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.






