- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డిప్యూటీ సీఎం భట్టి లేఖ
తెలంగాణను హరిత శక్తి సామర్థ్య రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మోడల్ సోలార్ విలేజ్” కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను హరిత శక్తి సామర్థ్య రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మోడల్ సోలార్ విలేజ్” కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఆదివారం అసెంబ్లీ హాల్లో ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన వ్యక్తిగతంగా లేఖలు అందజేశారు. ప్రతి ప్రజాప్రతినిధి తన సొంత గృహంలో కిలోవాట్ గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజల్లో సౌర విద్యుత్ పట్ల అవగాహన కల్పించాలంటే ముందుగా నాయకులే ఆదర్శంగా నిలవాలని, తద్వారా నివాస ప్రాంతాలను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చవచ్చని ఆయన ఆకాంక్షించారు. ఈ విధానం వల్ల గృహ విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా, రాష్ట్ర హరిత శక్తి గ్రిడ్‌కు గణనీయమైన సహకారం అందుతుందని వివరించారు. ఆసక్తి గల ప్రజాప్రతినిధులు తమ నివాస చిరునామా, తాజా విద్యుత్ బిల్లు ప్రతులను ఖైరతాబాద్‌లోని టీజీరెడ్కో కార్యాలయానికి అందజేయాలని కోరారు. వీటి ఆధారంగా సాంకేతిక బృందం సర్వే నిర్వహించి ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలిపారు. కార్బన్ న్యూట్రాలిటీ సాధనలో, శక్తి-సమృద్ధ తెలంగాణ నిర్మాణంలో ఈ నిర్ణయం ఒక కీలక అడుగు అని భట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు.






