- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరికీ ఒకే తరహా యూనిఫాం.. డిప్యూటీ CM భట్టి కీలక ప్రకటన
విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా క్షణం కూడా అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, అకుంఠిత దీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా క్షణం కూడా అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, అకుంఠిత దీక్ష, నిబద్ధతతో సిబ్బంది పనిచేయడం వల్లే సాధ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ ప్రజాభవన్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ అండ్మెయింటెనెన్స్ సిబ్బందితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటరాక్షన్ అయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ట్రాన్స్‌కో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్‌లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్ ఉండదని దుష్ప్రచారం చేసిన వారికి చెంపపెట్టు లాగా ఈ ఏడాది మార్చిలో 17,162 మెగావాట్లకు పైగా పిక్ డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం కూడా కరెంటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసి వారి విమర్శలను తిప్పి కొట్టిన విద్యుత్తు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉన్నత స్థాయిలో నేను, యజమాన్యాలు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు చేస్తున్న సేవలను గుర్తించి అభినందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సిబ్బందిని ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగానే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల సమస్యను అధికారులంలోకి రాగానే పరిష్కరించి వేల మందికి పదోన్నతులు కల్పించామన్నారు.
మనందరం ఒకటే అన్న భావన కల్పించేందుకు డిస్కం కంపెనీలో పనిచేస్తున్న లైన్మెన్ నుంచి సీఎండీ వరకు ఒకే తరహా యూనిఫాం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, నిఫ్టు తో డిజైన్ చేయించి విద్యుత్ సిబ్బందికి డ్రెస్సులు ఇస్తామని ప్రకటించారు. యజమాన్యంతో పరిష్కారం కానటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని విద్యుత్ సిబ్బందికి భరోసా ఇచ్చారు. థర్మల్, సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వంతోనూ, హైడల్ పవర్ ఉత్పత్తి చేయడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలతో ఎంఓయూ చేసుకున్నామని వివరించారు.






