దానిని త్వరలోనే అమలు చేయబోతున్నాం.. DCM భట్టి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

పార్టీ నిర్మాణంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెంచారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

దానిని త్వరలోనే అమలు చేయబోతున్నాం.. DCM భట్టి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ నిర్మాణంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెంచారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం నిర్వహించిన ఏఐసీసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్​కుమార్​గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్​బాబు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్​రావు, మాజీ ఎమ్మెల్యే సంపత్​కుమార్​గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కులగణనను రాహుల్​గాంధీ ప్రస్థావించడం సంతోషకరమన్నారు. సంపద అందరికీ సమానంగా పంచాలని కాంగ్రెస్ అభిమాతం అన్నారు. దండి సత్యగ్రహ స్ఫూర్తితో కాంగ్రెస్​జనంలోకి ముందుకు వెళుతుందున్నారు. సబర్మతి ఒడ్డు నుంచి మరొక్కసారి ఈ దేశానికి సందేశం ఇవ్వాలనే న్యాయ్​పథ్ ఈ ప్లీనరీలో తీసుకోవడం జరిగింది.

ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు అవకాశాలు అన్ని కూడా పెద్దున కుల గణన సర్వే మాదిరి అన్నింటిని పంచాలని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీ నిర్మానం అనేది రాహుల్​గాంధీకి మొదటి నుంచి ఉన్నటువంటి ఆలోచన, దానిని కిందిస్థాయి నుంచి కూడా గ్రామీణ స్థాయి బూత్​కమిటీ నుంచి నిర్మాణం చేసుకుంటూ రావాలని, అలాగే జిల్లా కాంగ్రెస్​నాయకత్వంలో అధ్యక్షులు నాయకత్వంలో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని, వాళ్లు ఆ జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి వాళ్లే దళపతుళ్లగా ఉండి విధానపరమైన నిర్ణయాలు జరగాలని పార్టీ నిర్ణయం తీసుకోని ప్రకటించడం జరిగిందని, త్వరలోనే అమలు కూడా చేయబోతున్నారని తెలిపారు.

Next Story