గుడ్‌న్యూస్.. అన్ని శాఖల ఉద్యోగులకు సింగరేణి తరహా రూ.1 కోటి ప్రమాద బీమా: డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

గుడ్‌న్యూస్.. అన్ని శాఖల ఉద్యోగులకు సింగరేణి తరహా రూ.1 కోటి ప్రమాద బీమా: డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభత్వం, సంస్థపై భారం పడకుండా సింగరేణి కార్మికులందరికీ రూ.1 కోటి విలువైన ప్రమాద బీమా అందిస్తున్నామని అన్నారు. సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్‌లో పని చేస్తున్న కార్మికులందరికీ ఇది వర్తింపజేస్తున్నామని తెలిపారు. కార్మికుల భద్రతకు భరోసా కల్పిస్తూ బ్యాంకుల ద్వారానే రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలులోకి తీసుకువస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం, స్థల కేటాయింపుల అంశాన్ని బోర్డులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

భవిష్యత్తులో అన్ని శాఖల ఉద్యోగులకు..

ప్రతి ఉద్యోగి భద్రతా హక్కును కాపాడే ప్రజా ప్రభుత్వంగా, భవిష్యత్తులో రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని శాఖల ఉద్యోగులకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా సదుపాయం కల్పించే కృషి చేస్తున్నామని తెలిపారు. మార్చి నెలకల్లా సింగరేణి ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిని భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ ల్యాబ్ ని కూడా ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. అలాగే తెలంగాణ రైజింగ్-2047 కు సంబంధించిన పత్రాన్ని సభలో ప్రవేశపెడుతున్నట్లు భట్టి తెలిపారు. ఈ పత్రం రాష్ట్ర భవిష్యత్తుకు దశ దిశ నిర్దేశం చేస్తుందని వెల్లడించారు.

Next Story