- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్ ఎస్టేట్ రంగ సమస్యలు పరిష్కారిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం చేపడుతున్న విస్తృత కార్యక్రమాలను వివరించారు. ప్రజా ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల్లోనే హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ. 20,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1,950.52 కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బి పరిధిలో రూ.12,500 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో రూ.4,365 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ స్థాయిలో నగరాభివృద్ధికి నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి అని స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా సమగ్ర ప్రణాళిక, ఒకే విధమైన పౌర సేవలు, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో సమతుల్య అభివృద్ధి సాధ్యమైందన్నారు.
ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, రహదారుల విస్తరణ
హెచ్-సిటి (H-CITI) ప్రోగ్రాం ద్వారా రూ. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేశామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కింద CURE–PURE-RARE వ్యూహంతో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీని కేంద్రంగా ఉంచుకుని అభివృద్ధి సాగుతోందన్నారు. వరద భద్రత, వాతావరణ అనుకూలత కోసం సమగ్ర స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. UMTA ద్వారా సమగ్ర స్పేషియల్, బ్లూ-గ్రీన్, మొబిలిటీ మాస్టర్ ప్లాన్‌లను రూపొందిస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధి కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాదని, ప్రజలపై నమ్మకం, సామాజిక న్యాయం, రాజకీయ స్థిరత్వం కూడా అవసరమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత నివసించదగిన, పెట్టుబడులకు అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, మున్సిపల్ ఎన్నికల బిజీ ఉన్నప్పటికీ ఈ సమావేశానికి హాజరుకావడం ద్వారా ప్రభుత్వానికి ఈ రంగంపై ఉన్న ప్రాధాన్యత స్పష్టమవుతుందని తెలిపారు. స్మార్ట్, స్థిరమైన, సమగ్ర అభివృద్ధితో ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.






