Rythu Bharosa: రేపు రైతు భరోసా సంబరాలు చేపట్టాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు

by Ramesh Naini |

అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలను పెద్ద ఎత్తున చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

Rythu Bharosa: రేపు రైతు భరోసా సంబరాలు చేపట్టాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా (Rythu Bharosa Celebrations) సంబరాలను పెద్ద ఎత్తున చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సూచించారు. గాంధీభవన్‌లో సోమవారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్యక్షతన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశామని తెలిపారు. ఇప్పటివరకు కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించామన్నారు.

రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఈ నెల 16 నుంచి జమ చేస్తున్నామని.. ఇది జూన్ 24 తో పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా రేపు 4 గంటలకు అన్ని మండల కేంద్రాలలో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కాంగ్రెస్ నేతలకు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్‌ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story