నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ఆలోచిస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

by Ramesh Naini |

సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తమ ఆదేశాల మేరకు రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ఆలోచిస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తమ ఆదేశాల మేరకు రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీతో బేగంపేటలోని హరితప్లాజాలో భట్టి భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన ఇంధన శాఖ అధికారుల బృందం నైనీ ప్రాంతాన్ని సందర్శించి అంచనాలు రూపొందిస్తుందని... తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ విట్టల్, సింగరేణి సిఎండి కృష్ణ భాస్కర్, సింగరేణి అధికారులు సత్యనారాయణ, తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story