- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయండి.. అధికారులకు డిప్యూటీ CM భట్టి కీలక ఆదేశం
నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి థర్మల్పవర్ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాద్నుండి వీడియో కాన్ఫరెన్స్ద్వారా సమీక్షించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి థర్మల్పవర్ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాద్నుండి వీడియో కాన్ఫరెన్స్ద్వారా సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా, బీహెచ్ఈఎల్సీఎండీ కే.సదాశివ మూర్తి, జెన్కో ఉన్నతాధికారుతో పాటు జెన్కో యాదాద్రి పవర్ప్లాంట్ఇంజినీర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ అగ్ని ప్రమాదంలో కొన్ని కేబుల్స్, వాల్వులకు స్పల్ప నష్టం వాటిల్లినట్లు ఈ సందర్భంగా తెలుసుకున్నారు.
ముఖ్యంగా ఇంధనం ఆయిల్లీకేజీనే ఈ అగ్నిప్రమాదానికి కారణంగా గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు తెలిపారు. ప్రస్తుతం ఈ యూనిట్బీహెచ్ఈఎల్ఆధీనంలోని ట్రయల్ఆపరేషన్విభాగంలోనే ఉన్నట్లు గుర్తించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కాలేదని అధికారులు డిప్యూటీ CM దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అధికారులకు సూచిస్తూ వీలైనంత త్వరగా యూనిట్మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. నేడు మంగళవారం నాటికే యూనిట్పనులను పున:ప్రారంభించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ నష్టం ప్లాంట్సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగించదని, మరమ్మతు పనులను 7 నుంచి 10 రోజులలో సమాంతరంగా చేపట్టవచ్చని బీహెచ్ఈఎస్తెలియజేసిందని డిప్యూటీ సీఎం వివరించారు.






