ప్రతి శాఖ పూర్తి ప్రతిపాదనలతో రావాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టమైన దిశానిర్దేశం

by Ramesh Naini |

అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.

ప్రతి శాఖ పూర్తి ప్రతిపాదనలతో రావాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టమైన దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో రేషనలైజేషన్ చేసుకొని రావాలని డిప్యూటీ సీఎం, సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు సబ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. 1:3 శాతం చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలని, ప్రతిపాదనల సంఖ్య ఎక్కువగా ఉంటే సంవత్సరాల వారిగా ప్రాధాన్యత క్రమంలో విభజన చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

సూచించిన మేరకు అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి రావాలని డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. Ham రోడ్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సబ్ కమిటీ సభ్యులు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలో వచ్చిన ప్రతిపాదనలను సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వివిధ శాఖల కార్యదర్శులు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story