రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ.. ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం

by Ramesh Naini |   (  Updated:2025-10-05 13:05:26  IST  )

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ.. ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే బీసీ రిజర్వేషన్‌లపై ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy).. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)కి ఫోన్ చేశారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల అంశంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలని సీఎం ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టులో (BC Reservations) బీసీ రిజర్వేషన్‌ కేసు విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఢిల్లీ పర్యటనకు సిద్దం అయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం దేశ రాజధానికి బయలుదేరినట్లు సమాచారం.

Next Story