- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒడిశా సీఎం మాంజీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
by Ramesh Naini |
నైనీ కోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేపడుతోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నైనీ కోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేపడుతోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపన సాధ్యాసాధ్యాలపై తెలంగాణ అధికారుల బృందం అధ్యయనం చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా తాజాగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌లోని బేగంపేట హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ విట్టల్, సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి అధికారులు సత్యనారాయణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అధ్యయనం నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
Next Story






