- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నక్సలిజం అంతంపై అసెంబ్లీ వేదికగా భట్టి కీలక ప్రకటన.. 732 మంది మా హయంలోనే..
బడ్జెట్‌లో హోంశాఖకు రూ.11,907 కోట్ల కేటాయించినట్టు తెలిపిన భట్టి.. మావోయిస్టుల లొంగుబాట్లపై మాట్లాడారు

దిశ, వెబ్‌డెస్క్: నక్సలిజం అంతం, లొంగుబాట్లపై ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. బడ్జెట్‌లో హోంశాఖకు రూ.11,907 కోట్ల కేటాయించినట్టు తెలిపిన భట్టి.. మావోయిస్టుల లొంగుబాట్లపై మాట్లాడారు. నక్సలిజం పుట్టుకకు కారణమైన ఫ్యూడలిస్టిక్ సామాజిక, ఆర్థిక అసమానతులను రూపుమాపడం ద్వారానే నక్సలిజం ఉద్యమం అంతం అవుతుందన్నారు. సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన మార్పు సాధ్యమని తెలంగాణ నిరూపించిందని, ఈ విధానంలో మనం దేశానికే మార్గదర్శకంగా మారామని భట్టి అన్నారు.గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని శాంతి-భద్రతల సమస్యగానే చూశాయని, ఈ క్రమంలో నక్సలిజాన్ని అణిచివేడానికి పోలీస్, సైనిక బలగాలను ఉపయోగించాయన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య మూలాలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా అడవుల్లోకి వెళ్లిన వాళ్లు సైతం ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారనే సామాజిక ఆర్థిక వాస్తవాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ విధానంలోనే ప్రజా ప్రభుత్వం అనుసరించిన దార్శనిక విధానం దేశానికి ఆదర్శ నమూనాగా నిలిచిందని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 347 మంది మావోయిస్టులు లొంగిపోతే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 7 నుంచి 2026 మార్చి 8 వరకు 732 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డిఫ్యూటీ సీఎం ప్రకటించారు. సరెండర్ అయిన వారికి పునరావాసం కల్పిస్తున్నట్లు తెలిపారు.






